News September 12, 2024

రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తున్నారు: KTR

image

TG: MLA కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని KTR ఖండించారు. ‘పట్టపగలే MLAపై హత్యాయత్నమా? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్‌ను గృహనిర్బంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? పార్టీ ఫిరాయించిన MLAలపై న్యాయపరంగా పోరాడుతున్నందుకే కౌశిక్‌ను టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా CM చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని మండిపడ్డారు.

Similar News

News January 30, 2026

BC రిజర్వేషన్ జీవోలపై స్టే కొనసాగుతుంది: హైకోర్టు

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఇచ్చిన జీవో(9, 41, 42)ల అమలుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన వాటితోపాటు తమ వాదనలు కూడా వినాలని పలువురు కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం.మొహియుద్దీన్‌ల బెంచ్ విచారించింది.

News January 30, 2026

విటమిన్ D టాబ్లెట్లు ఎప్పుడు వాడాలంటే?

image

ఎముకల ఆరోగ్యానికి విటమిన్‌ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల సమస్యలు, ఇతర కాల్షియం ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్‌ని తగ్గించే కాల్షియం, విటమిన్ డి ట్యాబ్లెట్స్ భోజనం తర్వాత తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రెండు కలిపి ఉంటే భోజనం తర్వాత తీసుకోండి. విడివిడిగా ఉంటే కాస్తా గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. పైగా ఈ ట్యాబ్లెట్స్‌ని ఐరన్ ట్యాబ్లెట్స్‌తో అస్సలు కలపకూడదని చెబుతున్నారు.

News January 30, 2026

మోకాళ్ల నొప్పి రాగానే నడక ఆపేస్తున్నారా?

image

చాలామంది మోకాళ్ల నొప్పి రాగానే నడవడం ఆపేస్తారు. అయితే మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని, అది కీళ్లు బిగుసుకుపోయేలా చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడవడం వల్ల కీళ్ల మధ్య జిగురు పెరిగి కండరాలు దృఢంగా మారి ఒత్తిడిని తట్టుకుంటాయని చెబుతున్నారు. ఈత, సైక్లింగ్ వంటివి ప్రయత్నించాలని.. మరుసటి రోజు నొప్పి పెరగకపోతే అది మీకు సురక్షితమని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.