News May 25, 2024
కారంపూడి, మాచర్లలో పది మందిపై రౌడీషీట్లు

AP: పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజు అల్లర్లకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితుల్ని గుర్తిస్తున్నారు. కారంపూడి, మాచర్లలో పది మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు. గ్రామాల్లో కార్డన్ సెర్చ్‌లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
Similar News
News December 31, 2025
ఈ కోళ్ల మాంసం KG రూ.2 లక్షల పైనే..

సాధారణంగా కేజీ చికెన్ ధర కోడిని బట్టి రూ.1000లోపే ఉంటుంది. ఇంకా అరుదైనది అయితే రూ.2వేలు లోపే. అయామ్ సెమనీ, ఒనగడోరి జాతులకు చెందిన కోడి మాంసం మాత్రం కేజీ ధర అక్షరాల రూ.2 లక్షల పైమాటే. డాంగ్ టావో జాతి కోడి మాంసం కిలో రూ.లక్షన్నర పైనే. కొన్ని ప్రత్యేక లక్షణాలే దీనికి కారణం. అసలు ఈ కోళ్లకు ఎందుకు అంత ధర? కిలో రూ.లక్షలు పలికే ఈ కోళ్ల జాతులు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 31, 2025
టోల్ మినహాయించాలని లేఖ.. BRS విమర్శలు

TG: సంక్రాంతికి HYD-విజయవాడ మార్గంలో <<18708714>>టోల్<<>> మినహాయించాలని కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడంపై BRS శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు. HYDలో ఉన్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ADB, మహబూబ్ నగర్, నల్గొండ వైపులకు వెళ్లేందుకు రూ.వందల టోల్ ఫీజులు కడుతున్నారుగా. దసరా, బతుకమ్మకూ ఇదే మినహాయింపు ఇవ్వండి మరి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నాయి.
News December 31, 2025
కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

AP: కృష్ణా జిల్లాలోని వైద్యఆరోగ్యశాఖలో 60 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/


