News September 18, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓నారాయణగూడ: టస్కర్ పై నుంచి పడి మహిళ మృతి
✓ఖైరతాబాద్: జులూస్ డ్యాన్స్ అదుర్స్
✓ఘట్కేసర్: మైనర్ బాలిక పై కేశవరెడ్డి(36) లైంగిక దాడి
✓మోడీకి బాలాపూర్ లడ్డు అందిస్తాం: శంకర్ రెడ్డి
✓HYDలో ఘనంగా జరిగిన విమోచన, ప్రజాపాలన, సమైక్యత వేడుకలు
✓ఖైరతాబాద్ గణనాథునికి పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
✓VKB: గల్లీ గల్లీలో గణనాథుని ఊరేగింపు

Similar News

News October 15, 2024

BREAKING: HYD: గోనెసంచిలో బాలిక మృతదేహం

image

HYD మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించింది. ఈనెల 12న కుమార్తె జోష్న(7) కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడంతో ఈరోజు బాలిక మృతదేహం గోనెసంచిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి, బాలికను ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News October 15, 2024

HYD: కాంక్లేవ్‌లో సత్తా చాటిన ఉప్పల్ విద్యార్థులు

image

యునైటెడ్ నేషన్స్ పీస్ క్రాఫ్టర్స్ కాంక్లేవ్‌లో HYD రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు అధికారులు తెలిపారు. హైకమాండేషన్ (UNGA) ఆర్యవీర్ గుప్తా, అర్జున్‌రావు వర్బల్ మెన్షన్ (UNHRC), వైష్ణవి వర్బల్ మెన్షన్(ECOSOC), తుమ్మల అక్షయ బెస్ట్ రిపోర్టర్‌గా గెలుపొందినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు.

News October 15, 2024

HYD: NIMSలో పేషంట్ల కోసం స్పెషల్ OP

image

అంటువ్యాధుల చికిత్స కోసం HYD పంజాగుట్ట NIMS ఆస్పత్రిలో ప్రతి మంగళ, గురువారం ఓపీ సేవలు అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, క్షయ, బ్లాక్ ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, కాలేయం లాంటి అవయవ మార్పిడి తర్వాత సోకే ఇన్ఫెక్షన్లనూ నయం చేస్తున్నట్లు తెలిపారు.