News October 19, 2024

RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓G.O.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ✓గ్రూప్-4 బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేయాలని డిమాండ్ ✓కూకట్పల్లి:ఓకే కుటుంబంలో ముగ్గురికి MBBS✓19న సికింద్రాబాద్ బంద్ ✓HYD ట్రాఫిక్ నియంత్రణ పై హైడ్రా ఫోకస్ ✓ఉన్మాదుల ట్రైనింగ్‌‌కు అడ్డాగా HYD:ఎంపీ ఈటల✓మూసి కోసం సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ ✓RR: వరి ధాన్యం కొనుగోలుకు 45 కేంద్రాలు

Similar News

News November 11, 2024

ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

image

ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు సులువుగా అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బస్‌పాస్ ఉన్నవారు తమ బస్‌పాస్‌తో ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌లో 10% డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. జనవరి 30వ తేదీ వరకు ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News November 11, 2024

HYDలో విషాదం.. గుండెపోటుతో గుడిలో మృతి

image

HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్(31) చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మృతి చెందాడు. KPHB పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News November 11, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చలి!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్‌, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.