News July 21, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓సనత్ నగర్: కరెంటు షాక్ తగిలి ముగ్గురు మృతి
✓సికింద్రాబాద్: మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి ప్రభాకర్
✓గ్రేటర్ HYD పరిధిలో త్వరలో రూ.5 లకే టిఫిన్..!
✓గ్రేటర్ HYDలో DRF నూతన టెక్నాలజీ
✓అన్ని జిల్లాల్లో BCG టీకాతో క్షయ వ్యాధికి చెక్
✓సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

Similar News

News October 8, 2024

దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

image

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News October 8, 2024

HYD: డిగ్రీ, పీజీ విద్యార్థులకు GOOD NEWS

image

అన్ని రంగాల్లో కీలకంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీపై ప్రభుత్వం డిగ్రీ, పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. కృత్రిమ మేధలో ఉచిత శిక్షణ అందించేందుకు HYDలో ‘నెక్ట్స్ వేవ్’ స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క ఏడాదిలో కనీసం లక్ష మందికి శిక్షణ అందించాలనే లక్ష్యం పెట్టుకుంది. వర్క్‌షాప్ ద్వారా 2-3 నెలల ట్రైనింగ్ అందిస్తారు. మొదట HYD కాలేజీల్లో దీన్ని అమలు చేస్తారు.

News October 8, 2024

HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్

image

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.