News July 26, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్
Similar News
News January 6, 2026
రంగారెడ్డిలో ‘పేదోడి విందు’ కొండెక్కింది

పేదోడి విందైన చికెన్ ధర కొండెక్కడంతో RRజిల్లాలో చికెన్ ప్రియులకు షాక్ తగిలి బెంబేలు ఎత్తుతున్నారు. న్యూ ఇయర్ ప్రారంభంలోనే కిలో చికెన్ ధర త్రిబుల్ సెంచరీకి చేరింది. గత కొన్ని రోజులుగా రూ.200- 250 ఉన్న ధర అమాంతం పెరగడంతో వచ్చే పండుగ ఎలా చేసుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం ఫారం ధర రూ.180 పలుకుతోంది. వినియోగం పెరిగి, కోళ్ల పెంపకం తగ్గడమే ధర పెరగుదలకు కారణమని ఫారం యజమానులు చెబుతున్నారు.
News January 5, 2026
మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్‌నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.
News January 5, 2026
RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.


