News August 22, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలి: KTR
✓సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు: సబిత
✓ఆదాని, మోడీ తీరుపై HYD నగరంలో కాంగ్రెస్ నేతల నిరసన
✓ఉప్పల్: నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు చలాన్లు
✓బాలాపూర్లో మరో మర్డర్
✓కోకాపేట: బాలిక పై సెక్యూరిటీ గార్డ్ అసభ్య ప్రవర్తన
✓HYD నగరంలో పెరుగుతున్న కాలుష్యం

Similar News

News January 21, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం

image

సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది

News January 21, 2025

పెరిగిన చలి: హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్

image

HYDలో చలి మరింత పెరిగింది. మంగళవారం HCU వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలి-9.3, BHEL-9.4, రాజేంద్రనగర్‌లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో 5 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. KBR పార్క్, ఇందిరా పార్క్, ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు వీచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.