News October 25, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అభివృద్ధికి చిరునామాగా కేంద్ర ప్రభుత్వం:ఈటల ✓కూకట్పల్లి రోడ్లపై వ్యభిచారం, అదుపులోకి 31 మహిళలు ✓బౌరంపేట: నాలుగేళ్ల పాపపై అత్యాచారం..మహిళా కమిషన్ సీరియస్ ✓RR మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై ED విచారణ పూర్తి ✓ఉప్పల్: 9 నెలల్లో 2 వేలకు పైగా కేసులు ✓HYD: అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్

Similar News

News November 13, 2024

HYD: ప్రజా కవికి 1992లోనే పద్మవిభూషణ్‌: KTR

image

ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, MLA KTR నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 1992లో భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ను పొందారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

News November 13, 2024

మాజీ MLA పట్నం నరేందర్ అరెస్ట్ దుర్మార్గం: హరీశ్ రావు

image

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

News November 13, 2024

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

image

గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతగల భారతీయ పౌరులు, భారతీయ విదేశీ పౌరులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 9 డిసెంబర్ 2024. అప్లై చేసిన హార్డ్ కాపీ డిసెంబర్ 16 లోపు పంపించాలి. మరిన్ని వివరాలకు https://uohyd.ac.in/careers-uoh/ సందర్శించవచ్చు. SHARE IT