News October 25, 2024
RR: ఏ జిల్లాలో ఎంత మంది గ్రామీణ ఓటర్లు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 1.67 కోట్ల ఓటర్లు ఉన్నట్లు SEC తెలిపింది. వికారాబాద్-6,71,940 మంది, RR-7,94,653 మంది గ్రామ పంచాయతీల్లో ఓటర్లు ఉండగా, మేడ్చల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 64,396 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.
Similar News
News November 20, 2025
చేవెళ్ల: ఎర్ర నీళ్లతో వీధి కుక్కలకు చెక్ పెట్టే ఆలోచన

వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు చేవెళ్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులు వినూత్న ఆలోచన చేశారు. ఎర్ర నీళ్లను ఖాళీ వాటర్ బాటిళ్లలో నింపి ఇంటి ముందు ఏర్పాటు చేశారు. ఎర్ర నీళ్లను చూసి వీధి కుక్కలు ఇంటి దగ్గరకు రాకుండా రోడ్డుపై ఉంటున్నాయని కాలనీవాసులు తెలిపారు. వీధి కుక్కల బెడద కోసం ఎర్రనీళ్ల ఆలోచన బాగుందని పలువురు చర్చించుకుంటున్నారు.
News November 20, 2025
GHMC స్టాండింగ్ కమిటీ మీటింగ్.. మూసాపేట్ కార్పొరేటర్ ARREST

GHMC స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట్ డివిజన్‌కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని, డివిజన్లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్ట్ చేశారని మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ తెలిపారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు.
News November 20, 2025
వికారాబాద్ కోర్టు చరిత్రలో తొలి సంచలన తీర్పు

VKB జిల్లా కోర్టు చరిత్రలో మొదటిసారిగా ఉరిశిక్షను విధిస్తూ గురువారం డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. హత్యకు గురైన ఘటన 2019 ఆగస్టు 5న VKBలో చోటుచేసుకుంది. గృహ కలహాల నేపథ్యంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. కేసు నమోదు చేసి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. కోర్టు నిందితుడికి కఠినమైన శిక్షను విధించింది.


