News March 18, 2025

RR కలెక్టరేట్‌లో 72 ఫిర్యాదులు స్వీకరణ

image

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.

Similar News

News April 22, 2025

Inter Results: రంగారెడ్డి విద్యార్థులకు ALERT

image

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

రేపు ఇంటర్‌ రిజల్ట్స్.. రంగారెడ్డిలో వెయిటింగ్

image

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మన రంగారెడ్డి జిల్లాలో 185 సెంటర్లు ఏర్పాటు చేయగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 83,829 విద్యార్థులకు 81,966 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 71,684 విద్యార్థులకు 70,431 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం రేపు తేలనుంది. ఇంటర్ ఫలితాలను <<16170006>>Way2News<<>>లో చెక్ చేసుకోండి.
SHARE IT

News April 21, 2025

HYD: విభిన్న వాతవరణం.. 3 రోజులు జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో రోజు రోజుకూ ఎండలు ఎక్కువవుతున్నాయి. HYD, MDCLలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదవుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొడుతుండగా, సాయంత్రం వర్షం పడుతోంది. ఉదయం 7 గంటల నుంచే వేడిమి అధికంగా ఉంటుంది. నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

error: Content is protected !!