News August 28, 2024
RR జిల్లాలో లక్షకు పైగా MSME యూనిట్లు

లక్షకు పైగా MSMEలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.ఇక్కడ 1,09,164 యూనిట్లు ఉండగా.. అందులో 87,376 సేవా రంగానికి చెందినవే.మిగిలిన 21,788 ఉత్పత్తి రంగంలో పనిచేస్తు న్నాయి.సూక్ష్మ సంస్థల సంఖ్యనే 1,04,846గా ఉంది. రూ.కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్ కల్గిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు.జూన్ 2024 వరకు ఉన్న వివరాల ప్రకారం చిన్న తరహా 3,866 ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 11, 2026
3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.
News February 11, 2026
RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.
News February 11, 2026
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల టాప్

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల వ్యాప్తంగా ఉ.11గం. వరకు మొత్తం 30.11% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 31.06%, ఆమనగల్లులో 25.58, చేవెళ్లలో 34.02, మెయినాబాద్‌లో 26.97, శంకర్‌పల్లిలో 32.05, షాద్‌నగర్‌లో 32.5% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. యువత ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాసామ్య స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఇప్పటివరకు చేవెళ్లలో ఇప్పటి వరకు అత్యధికంగా ఓటింగ్ నమోదైంది.


