News May 10, 2024

RR: పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ!

image

పోటీ చేసేది ఇక్కడ.. ఓటు వేసేది అక్కడ. ఇది ప్రధాన పార్టీల అభ్యర్థుల పరిస్థితి. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరు అసెంబ్లీ, చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ఓటు హక్కు ఉంది. చేవెళ్ల BRS నుంచి పోటీ చేస్తున్న కాసానికి జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ఓటు హక్కు ఉంది. దీంతో వారికి వారు ఓటు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

Similar News

News February 9, 2026

GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

image

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్‌ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్‌గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.

News February 9, 2026

HYD‌లో బండిపోతే ‘బండి’.. ఏమైంది బండి?: CM

image

నగరంలో వరదలు వస్తే లోతట్టు ఇళ్లు, వాహనాలు మునిగిపోతాయని CM రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. వరదల సమస్యను ప్రచారంలో వాడుకున్న బండి సంజయ్‌ గత GHMC ఎన్నికల్లో దాదాపు 50 మందిని గెలిపించుకున్నారని పేర్కొన్నారు. కానీ, ‘బండి పోతే బండి ఇస్తాం’ అన్న సంజయ్ ఆ హామీని నీరు గార్చారని, BJPకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచారని రేవంత్ తీవ్రంగా విమర్శించారు.

News February 9, 2026

కాసేపట్లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ

image

మరికాసేపట్లో GHMC స్టాండింగ్ కమిటీ చివరి/ సాధారణ సమావేశం జరగనుంది. ఈ అజెండాలో మొత్తం 9 అంశాలను పొందుపరిచారు. కూకట్‌పల్లి జోన్‌లో క్రికెట్ పిచ్‌లు, షటిల్ కోర్టుల నిర్వహణకు కొత్త టెండర్లు, యూసుఫ్ నగర్ వైకుంఠధామం నిర్వహణ బాధ్యతలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వీటితో పాటు రూ. 3.45 కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణం, రూ. 2.45 కోట్లతో బాక్సింగ్ కోర్టు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నారు.