News July 28, 2024
RR: భారీగా నిధులు ప్రకటించిన CM రేవంత్ రెడ్డి
కల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కల్వకుర్తి అసెంబ్లీ RR జిల్లా పరిధి మండలాలైన ఆమనగల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.10కోట్లు, మాడ్గుల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3కోట్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు ప్రకటించారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రిని రూ.22 కోట్లతో నిర్మిస్తామన్నారు.
Similar News
News October 4, 2024
HYD: నేడు హైకోర్టులో వైద్య శిబిరం
నిర్మాణ్ సంస్థ, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ఈరోజు హైకోర్టులో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేశ్ సహాయ్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 4, 2024
గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు
సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.
News October 3, 2024
HYD: పోలీసుల సూచనలు.. ఇలా చేస్తే SAFE!
✓క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్ లైన్ బ్యాంకింగ్, కంప్యూటర్, మొబైల్ లాంటి వాటి పాస్వర్డ్ తరచుగా మార్చుకోవాలి
✓పాస్వర్డ్ పెట్టేముందు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండేలా చూసుకోవాలి
✓పాస్వర్డ్ వివరాలను ఎంత దగ్గర వారికైనా చెప్పొద్దు
✓ఫేక్ మెసేజ్ లింకులు, మెయిల్స్, కాల్స్ పై స్పందించకండి.
✓సైబర్ నేరంగా గుర్తిస్తే 1930కు కాల్ చేయండి
•పై సూచనలు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చేశారు.