News November 19, 2024

RR: మసకబారుతున్న భవిత.. జాగ్రత్త!

image

HYD, RR జిల్లాలలోని దాదాపుగా 66,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణ పూర్తయింది. 5-12వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు 4,701 మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అనేక మంది విద్యార్థులకు అక్షరాలు మసకబారుతున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్లు, తదితరాలు చూడడమే కారణమని తెలిపారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.

Similar News

News December 18, 2025

శంకర్‌పల్లి: ప్రజలారా డబ్బులు వెనక్కివ్వలేదో… స్టేటస్ పెట్టేస్తా

image

శంకర్పల్లి మం.లోని ఓ గ్రామ సర్పంచి స్థానానికి పోటీచేసి ఓడిన అభ్యర్థి ఒకరు తనకు ఓటు వేయనివారు తానుపంచిన డబ్బును రిటన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే డబ్బులు తీసుకున్నవారి పేర్ల జాబితాను ఐదేళ్లపాటు రోజూ వాట్సప్ స్టేటస్ లో పెడతానని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. డబ్బులు వెనక్కి పంపినవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ స్టేటస్‌కు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చిందంటూ ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు.

News December 18, 2025

RR: సొంత ఇలాఖాలో MLAల డీలా!

image

సొంత ఇలాఖాలో MLAలు డీలా పడ్డట్లు GP ఎలక్షన్స్‌ స్పష్టంచేస్తున్నాయి. షాద్‌నగర్ MLA నియోజకవర్గం సహా స్వగ్రామంలో ప్రభావం చూపలేకపోయారు. పలు మండలాల్లో BRS హవా నడిచింది. చేవెళ్లలో 16 గెలిచినప్పటికీ 10 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో గెలిచింది. రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శంషాబాద్‌లోనూ అతితక్కువ ఓట్లతోనే గెలిచింది. అలాగే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాల్లోనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.

News December 18, 2025

రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఓటింగ్ జరగలే!

image

జిల్లాలో 3విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మాడ్గులలో 34 గ్రామాలుంటే 33 GPలకు మాత్రమే పోలింగ్ జరిగింది. నర్సంపల్లిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి హనుమాన్ నాయక్ ఓటర్ల కార్డు ఉండి.. ఆయన వివరాలు గ్రామ ఓటర్ల లిస్టులో లేకపోవడం, అతడి, కుటుంబ ఓట్లు ఇతర గ్రామాల్లో ఉండటంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి అయ్యే వరకు ఎన్నికలు వద్దని హైకోర్టు ఆదేశించింది.