News November 19, 2024

RR: మసకబారుతున్న భవిత.. జాగ్రత్త!

image

HYD, RR జిల్లాలలోని దాదాపుగా 66,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణ పూర్తయింది. 5-12వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు 4,701 మందికి కంటిచూపు సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అనేక మంది విద్యార్థులకు అక్షరాలు మసకబారుతున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలైన ఫోన్లు, తదితరాలు చూడడమే కారణమని తెలిపారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.

Similar News

News December 3, 2024

HYD: పాములు పట్టుకునే వారికోసం కాల్ చేయండి!

image

నగరంలో పలుచోట్ల పాములు కనిపించినప్పుడు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి వెటర్నరీ అధికారులు శుభవార్త తెలిపారు. పాముల సంబంధిత ఫిర్యాదుల కోసం బోర్డు పై ఉన్న నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే వారు వచ్చి, పాములను పట్టుకుంటారని GHMC అధికారులు పేర్కొన్నారు.

News December 2, 2024

HYD: చేవెళ్ల యాక్సిడెంట్.. CM రేవంత్ దిగ్భ్రాంతి

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో రైతులు ప్రేమ్(ఆలూరు), రాములు(ఆలూరు), సుజాత(ఖానాపూర్ ఇంద్రారెడ్డినగర్‌) అక్కడికక్కడే చనిపోయారు.

News December 2, 2024

HYD: మాజీ సీఎంకు స్పీకర్ నివాళులు

image

మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్క్ స్మారక స్థూపం వద్ద తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.