News May 4, 2024
RR, మేడ్చల్ జిల్లా ప్రజలకు GOOD NEWS

గాంధీ, ఉస్మానియా వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు 100 సీట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు.RRజిల్లా కందుకూరు, మేడ్చల్ జిల్లా చింతల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత వైద్య కళాశాలల విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఆసుపత్రులను నిర్ణయించనున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా.. ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది.
Similar News
News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్ఛార్జికి చెప్పారు. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.
News October 20, 2025
ఖైరతాబాద్లో రేపు సాయంత్రం సదరోత్సాహం

ఖైరతాబాద్లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
News October 20, 2025
HYD: సెంచరీకి మరో ఆరు.. రేపు పూర్తయ్యే అవకాశం

మీరు చదివింది నిజం.. సెంచరీకి మరో ఆరుమంది దూరంగా ఉన్నారు. అయితే అది క్రికెట్లో కాదండి.. ఎన్నికల్లో. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 94 మంది నామినేషన్లు సమర్పించారు. ఇక కేవలం 6 వేస్తే వీరి సంఖ్య 100కు చేరుకుంటుందన్నమాట. నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అని ప్రజలతోపాటు అధికారులు ఎదురుచూస్తున్నారు.