News May 4, 2024

RR, మేడ్చల్ జిల్లా ప్రజలకు GOOD NEWS

image

గాంధీ, ఉస్మానియా వైద్య సేవలపై ఒత్తిడి తగ్గించేందుకు 100 సీట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు.RRజిల్లా కందుకూరు, మేడ్చల్ జిల్లా చింతల్‌లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వైద్య కళాశాలల విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఆసుపత్రులను నిర్ణయించనున్నారు. వైద్య కళాశాలల నిర్మాణం ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా.. ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించింది.

Similar News

News April 16, 2026

RR: మండుతున్న ఎండలు.. ఇవి తప్పనిసరి

image

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీంతో డీ హైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి తెలిపారు. సాధ్యమైనంత వరకు మ.12 గం. నుంచి 4 వరకు బయట తిరగక పోవడమే ఉత్తమమని, అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు

News April 14, 2026

రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

image

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లో RRకు 5TH ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. RR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 74723 మంది పరీక్షలు రాయగా 60981 మంది పాసై 81.61 శాతంతో స్టేట్‌లోనే 5th ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 3042మందికి 2279 మంది పాసై 74.92%తో 15వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7,246మందికి 2106 మంది పాసై 29.06%తో 26వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 223 మందికి 115 మంది పాసై 51.57%తో 17వ ప్లేస్ వచ్చింది.