News November 6, 2024

RR: లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధం..!

image

ఉమ్మడి RR, HYD జిల్లాల్లో లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. GHMC పరిధిలో 28 లక్షల కుటుంబాలు, RRలో 6.57 లక్షలు, వికారాబాద్ 6.54 లక్షల కుటుంబాల సర్వే జరగనుంది. మరోవైపు GHMC-21 వేల ఎన్యుమరేటర్లు, RR 5,344, VKB-2024 మంది సర్వే చేయనున్నారు. మొదటి దశ నేటి నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నది. ఒక్కో సూపర్‌వైజర్ కింద 10 మంది ఎన్యుమరేటర్లు పనిచేయనున్నారు.

Similar News

News December 8, 2024

HYD: ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షోకు వెళ్తున్నారా?

image

HYD హుస్సేన్ సాగర్ వద్ద జరిగే ఎయిర్ షోకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేశారు. PVNR మార్గ్, నెక్లెస్ రోడ్డులో కార్లు, టూ వీలర్ పార్కింగ్, ఆదర్శనగర్ గల్లీలో టూవీలర్, GHMC హెడ్ ఆఫీస్ గల్లీలో కార్లు, టూవీలర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోట్ క్లబ్‌లో మంత్రుల కార్లు, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద MLA, MP, MLC, IAS, నేతల వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు.

News December 8, 2024

HYD: B1, B2 వీసాలకు ఫుల్ డిమాండ్..!

image

HYD నగరంలో B1,B2 వీసాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని US కాన్సులేట్ జెన్నిఫర్ తెలిపారు. వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలో భారతదేశ రికార్డును శనివారం నాడు బ్రేక్ చేసినట్లుగా వెల్లడించారు. కొత్త టెక్నాలజీ వినియోగం, పెరిగిన సిబ్బందితో నిరీక్షణ సమయం చాలా వరకు తగ్గిందని, సేవలను అద్భుతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు తమకు సంతోషంగా ఉందని తెలిపారు.

News December 8, 2024

HYD: ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్లకండి!

image

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద నేడు IAF ఎయిర్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్‌పై భారీ బందోబస్తును మోహరించారు. ఎక్కడికక్కడ బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని,వాహనాలను అనుమతించమని తెలిపారు. నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి వంతెన,VV స్టాచ్యూ, రవీంద్ర భారతి, కవాడిగూడ జంక్షన్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది.