News October 18, 2024
RR: వరి ధాన్యం ధరల అంచనాపై REPORT

ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర మార్కెట్లలో వరి ధాన్యం సాధారణ రకం ధర క్వింటాకు రూ.2203- రూ.2350, ఏ గ్రేడ్ రకం రూ.2290- రూ.2680 ఉండొచ్చని RR జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంచనా వేసింది. వరి ధాన్యం ధరలను అంచనా వేసేందుకు రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ ఆర్థిక సాయం అందించగా.. అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి, 22 ఏళ్ల ధరల ఆధారంగా ఈ రిపోర్ట్ వెల్లడించింది.
Similar News
News December 7, 2025
రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్

చిల్కూర్‌లో SBI రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువతకి సీసీటీవీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి రంగారెడ్డికి చెందిన 18- 45 ఏళ్లలోపు పురుషులు చిల్కూర్ SBI శిక్షణ కేంద్రంలో పేరును నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. డిసెంబర్ 9 నుంచి ఉచిత శిక్షణతో పాటు, ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం, యూనిఫామ్, టూల్ కిట్ ఇస్తారు. వివరాల కోసం 8500165190లో సంప్రదించగలరు.
News December 6, 2025
రంగారెడ్డి: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో శుక్రవారంతో ముగిసింది. చివరి విడతలో స్వీకరించిన నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు. ఈనెల 9వ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. మూడో విడతలో 174 గ్రామపంచాయతీలకు, 1598 వార్డులకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. కాగా, జిల్లావ్యాప్తంగా 526 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

ఓఆర్ఆర్పై అతివేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.


