News October 18, 2024
RR: వరి ధాన్యం ధరల అంచనాపై REPORT
ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర మార్కెట్లలో వరి ధాన్యం సాధారణ రకం ధర క్వింటాకు రూ.2203- రూ.2350, ఏ గ్రేడ్ రకం రూ.2290- రూ.2680 ఉండొచ్చని RR జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంచనా వేసింది. వరి ధాన్యం ధరలను అంచనా వేసేందుకు రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ ఆర్థిక సాయం అందించగా.. అగ్రికల్చర్ మార్కెట్ ఇంటలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి, 22 ఏళ్ల ధరల ఆధారంగా ఈ రిపోర్ట్ వెల్లడించింది.
Similar News
News November 6, 2024
శంకర్‌పల్లి: ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రి
శంకర్‌పల్లి పరిధి సింగాపురంలో నూతనంగా నిర్మించిన మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి శిఖర ధ్వజ విగ్రహనాభిషీల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి భీమ్ భరత్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
News November 6, 2024
RR: లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధం..!
ఉమ్మడి RR, HYD జిల్లాల్లో లక్షల కుటుంబాల సమగ్ర సర్వేకు రంగం సిద్ధమైంది. GHMC పరిధిలో 28 లక్షల కుటుంబాలు, RRలో 6.57 లక్షలు, వికారాబాద్ 6.54 లక్షల కుటుంబాల సర్వే జరగనుంది. మరోవైపు GHMC-21 వేల ఎన్యుమరేటర్లు, RR 5,344, VKB-2024 మంది సర్వే చేయనున్నారు. మొదటి దశ నేటి నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నది. ఒక్కో సూపర్‌వైజర్ కింద 10 మంది ఎన్యుమరేటర్లు పనిచేయనున్నారు.
News November 6, 2024
HYD: మెట్రో ముందడుగు.. GOOD NEWS
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,741 కోట్ల అంచనాతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన HYD పాతబస్తీ మెట్రో (MGBS- చంద్రాయన గుట్ట)భూ సేకరణపై కలెక్టర్ అనుదీప్ మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 2 విడతల్లో 400 వరకు ఆస్తులను నోటిఫై చేశారు. తాజాగా.. దారుల్‌షిఫా నుంచి శాలిబండ వరకు సేకరించాల్సిన భూమిపై నోటిఫికేషన్ ఇచ్చారు. అభ్యంతరాలను 2025 జూన్ 2 వరకు బేగంపేట మెట్రో రైల్ కార్యాలయంలో అందించాలి.