News February 6, 2025
RR: షాద్‌నగర్‌లో బంద్‌కు పిలుపు
శస్త్ర పాఠశాలలో నీరజ్ అనే విద్యార్థి స్కూల్ పై నుంచి దూకి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా నేడు షాద్‌నగర్ పట్టణంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ సూచించారు.
Similar News
News February 6, 2025
పెద్దఅంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి
పెద్దఅంబర్‌పేట్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
News February 6, 2025
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. క్లారిటీ
శంషాబాద్‌లో కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. రాళ్లగూడ విలేజ్ వద్ద ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా 55 మీటర్ల మేర ప్రహరీ నిర్మించారు. సర్వీసు రోడ్డుకు వెళ్లే దారి లేకుండా చేశారని రాళ్లగూడ విలేజ్ పరిసర ప్రాంతాల లేఔట్‌ల నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం
సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.