News August 19, 2025
RR: ఆకులమైలారం బిడ్డ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా..!

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి <<17452574>>ఎంపికైన విషయం<<>> తెలిసిందే. రంగారెడ్డి(D) కందుకూరు(M) ఆకులమైలారంలో 1946 జులై 8న ఓ సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. 1971లో HYDలోని ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. ప్లీడర్‌గా పని చేసిన ఆయన 1990లో ఓయూ లీగల్ అడ్వైజర్‌గా ఉన్నారు. తమ గ్రామస్థుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడంపై ఆకులమైలారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News August 19, 2025
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్‌లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్‌గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా నిర్మల నరసింహన్ ఉన్నారు.
News August 19, 2025
HYD: అక్రమ సరోగసి కేసు.. మూడు సెంటర్లకు నోటీసులు

అక్రమ సరోగసి కేసును HYD పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించి మూడు సెంటర్లను నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌లోని హెగ్డే హాస్పిటల్, కొండాపూర్‌లోని శ్రీ ఫెర్టిలిటి సెంటర్, సోమాజిగూడలోని ఫెర్టి కేర్‌కు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ సరోగసి వ్యవహారంలో ఈ మూడు ఆస్పత్రులు కీలకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు.
News August 19, 2025
యాదగిరిగుట్ట ఆలయానికి నాలుగు ISO సర్టిఫికెట్లు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.