News July 20, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విడుదల: చనగాని
✓సికింద్రాబాద్: లష్కర్ బోనాలకు సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం ✓గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,91,205
✓శంషాబాద్:యువకుడి అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపేసిన మహిళలు
✓బాలాపూర్:సీఎం 30 వేల ఉద్యోగాలిచ్చారు:KLR
✓ఖైరతాబాద్: శరవేగంగా 70 అడుగుల గణపయ్య విగ్రహ పనులు
✓HYD-బీజాపూర్ హైవే విస్తరణకు లైన్ క్లియర్

Similar News

News August 17, 2025

RR: దయనీయంగా ఆదర్శ ఉపాధ్యాయుల పరిస్థితి

image

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మరి అప్పుల పాలవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు సేవల సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్, పీడీ, నైట్ వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు సైతం 5నెలలకు పైగానే వేతనాలు రాలేదు.

News August 17, 2025

HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. రిమాండ్

image

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఇంట్లో చెబుతాడన్న భయంతో కమర్ బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

News August 16, 2025

HYD: ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

image

చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.