News July 26, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్
Similar News
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్‌కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్‌కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.
News November 25, 2025
GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.


