News July 28, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYD, RR, MDCL జిల్లాల్లో ఘనంగా జరిగిన బోనాలు
✓సికింద్రాబాద్: క్యూఆర్ కోడ్ ద్వారా గాంధీలో ఓపి
✓కల్వకుర్తి అసెంబ్లీకి రూ.309 కోట్ల నిధుల ప్రకటన
✓సికింద్రాబాద్: TGSRTC ప్రకటనల పై టెండర్లకు ఆహ్వానం
✓అబ్దుల్లాపూర్మెట్: గంజాయి మత్తులో బైకులు తగలబెట్టారు
✓అసదుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం: బండి

Similar News

News January 18, 2025

HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి

image

సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. 

News January 18, 2025

RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!

image

ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది. 

News January 18, 2025

RR: రైతు భరోసా సర్వే.. టార్గెట్-20

image

RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.