News August 8, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓HYDలో కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటాం:భట్టి
✓ఉస్మానియా మెడికల్ కాలేజీకి ISO గుర్తింపు
✓దిల్సుఖ్ నగర్: బస్ కండక్టర్ పై పాము విసిరిన వృద్ధురాలు
✓అల్వాల్: వెల్నెస్ స్పా సెంటర్లో వ్యభిచారం
✓రంగులు మార్చడంలో OYC బ్రదర్స్ ఊసరవెల్లిని మించారు: ఫిరోజ్ ఖాన్
✓ఆగస్టు 14న కాగ్నిజెంట్ విస్తరణకు ముహూర్తం ఖరారు
✓శంషాబాద్: ఏపీ డ్రైవర్లను హైదరాబాదులో తిరగనివ్వాలి: పవన్ కళ్యాణ్

Similar News

News September 25, 2024

హైదరాబాద్‌‌కు వర్ష సూచన⛈️

image

హైదరాబాద్‌కు బుధవారం వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. నగరంలో నిన్నటి మాదిరిగానే మళ్లీ మధ్యాహ్నం, రాత్రి సమయంలో (వరుసగా 6వ రోజు) ఉరుములతో కూడిన వర్షం పడనుంది అని తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్వీట్ చేశారు. నగరవాసులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో HYDలో 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 252 స్టాటిక్ బృందాలను ఏర్పాటు చేసిన GHMC సహాయక చర్యలు చేపడుతోంది.

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.