News March 4, 2025

RR: ఒక్కొకరికి ఏడాదికి రూ.9.54 లక్షల సంపాదన..!

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా వార్షిక తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.9.54 లక్షలతో మొదటి స్థానంలో ఉంది. HYD రూ.4.97 లక్షలుగా ఉండగా, చివరిగా వికారాబాద్ 33వ స్థానంలో రూ.1.9 లక్షలుగా ఉంది. ఈ వివరాలను రాష్ట్ర గుణాంకాల నివేదిక- 2024లో వెల్లడించింది. తాజాగా అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు.

Similar News

News September 18, 2025

మంథని: అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మొదలైన సీబీఐ విచారణ

image

అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో సీబీఐ అధికారుల బృందం విచారణ మొదలైంది. గురువారం మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో వామనరావు ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వారి వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ పాల్గొన్నారు. సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో మంథని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

News September 18, 2025

శ్రీరాంపూర్: ‘జీఎం కార్యాలయాల ముట్టడి జయప్రదం చేయాలి’

image

సింగరేణి యాజమాన్యం అవలంబిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం జరిగే జీఎం కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7, ఎస్ఆర్పీ 3గనుల్లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. దసరా పండుగ సమీపిస్తున్నా సంస్థకు వచ్చిన లాభాలు, కార్మికులకు ఇచ్చే వాటాను ఇంతవరకు ప్రకటించక పోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

News September 18, 2025

పాడేరు: గ్యాస్ అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు

image

గ్యాస్ సిలిండర్‌ను కంపెనీ ఇచ్చిన రేట్ల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ డీలర్లను హెచ్చరించారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్‌లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. గ్యాస్‌కు అదనంగా వసూలు చేస్తున్నారని లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.