News October 6, 2025

RR: గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతుండగా.. MPTC, ZPTC స్థానాల నుంచి పోటీ చేసే వారి పేర్లను సేకరించి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కాగా, కోర్టు తీర్పు తర్వాత ముందుకెళ్లాలని పార్టీలు యోచిస్తున్నాయి.

Similar News

News October 5, 2025

RR: రేపటి నుంచి ప్రజావాణికి బ్రేక్

image

రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News October 5, 2025

RR: ‘అక్కా.. అమ్మా.. బాగున్నారా?’

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7,94,653 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 3,95,216 ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు ఇప్పటికే ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆత్మీయంగా అక్కా.. అమ్మా.. అమ్మమ్మా అంటూ పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు.

News October 5, 2025

రంగారెడ్డి జిల్లా వర్షపాతం ఇలా..

image

గడచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం ఇలా ఉంది. అత్యధికంగా అత్తాపూర్లో 50 మి.మీ, రాజేంద్రనగర్ 40.8, శాస్త్రిపురం 32, శివరాంపల్లి 31.3, ప్రొద్దుటూరు 31, రాజేంద్రనగర్ 30, మాణికొండ 25.5, శంకర్పల్లి 25.3, ఖాజాగూడ 25, నల్లవెల్లి 17.8, ఆరుట్ల 18, ధర్మసాగర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం 15.5, బాలాపూర్ 14.5, మొయినాబాద్లో 13 MM వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ వర్షం అక్కడక్కడా కురిసింది.