News October 1, 2024

RR జిల్లాలో DSC టాపర్ల లిస్ట్ ఇదే..!

image

RR జిల్లాలో DSC ఫలితాల్లో తెలుగులో పి.మహేశ్-70.97, జి.అంజయ్య-71.30తో సత్తాచాటారు. కాగా SGT బి.చెన్నయ్య-82, బి.శిరీష హిందీ పండిట్-63.33, ఫర్జానా బేగం ఉర్దూ-67.43, బి.శ్రీకాంత్ PET-67.50, పి.నందిత స్కూల్ Asst బయాలజీ-78.07, M.శ్రీకాంత్ ఇంగ్లిష్-81.33, వి.శ్రీరామ్ కిషోర్ హిందీ-60.58, యం.శ్రీకాంత్ గణితం-81.33, రవిచంద్రరాజు ఫిజిక్స్-72.33, జి.వంశి సాంఘిక-79.70, బి.జెస్సికా-SGT(spl)-74.7గా నిలిచారు.

Similar News

News February 15, 2026

HYD: తొలి అడుగు 10th తర్వాతే!

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహించింది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.

News February 15, 2026

హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

image

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.

News February 15, 2026

HYD: ఈ శివాలయానికి వెయ్యేళ్ల చరిత్ర..!

image

శివారులోని శంకర్‌పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్‌పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్‌చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్‌పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.