News November 13, 2024
RR: ప్రతి గ్రామంలో విత్తనోత్పత్తికి రంగం సిద్ధం..!

గ్రామాల్లో విత్తనోత్పత్తికి రంగం సిద్ధమైంది. RR,MDCL,VKB జిల్లాల్లో వచ్చే ఏడాది వానకాలం నుంచి ప్రతి గ్రామంలో 5-10 మంది అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసేలా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు, విత్తన విభాగాన్ని ఏర్పాటు చేసి, వర్సిటీ సైంటిస్టులు తయారు చేసిన విత్తనాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులు పండించిన పంట నుంచి విత్తనాలను ఉత్పత్తి చేస్తారు.
Similar News
News February 13, 2026
RR: 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు వెళ్లడైన వెంటనే ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ కసరత్తు ప్రారంభంకానుంది. ఈ నెల 16న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఇందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో అధికారిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే వీరు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 13, 2026
RR: మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు.. అంతా READY..!

మున్సిపల్ ఓట్ల లెక్కించేందుకు సర్వం సిద్ధమైంది. బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోలింగ్ బూతుల వారీగా నమోదైన ఓట్లపై అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు.
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.


