News October 25, 2025

RR: మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మహర్దశ..!

image

RR, MDCL జిల్లాల పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మహర్దశ పట్టనుందని అడ్మినిస్ట్రేషన్ విభాగం తెలిపింది. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాల పథకం కింద రూ.41.20 కోట్లను విడుదల చేసిందని కార్యదర్శి డాక్టర్ శ్రీదేవి తెలిపారు. RR, MDCL జిల్లాలకు 30% వరకు నిధులు సమకూరుతాయని తెలిపారు.

Similar News

News October 25, 2025

నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్‌లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 25, 2025

ఓటర్ జాబితాను పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలి: కలెక్టర్

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్.ఐ.ఆర్)లో భాగంగా 2025 ఓటర్ జాబితాను 2002 ఎస్.ఐ.ఆర్ తో పకడ్బందీగా మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ ఆర్ వో, ఏఈఆర్‌వో, డిప్యూటీ తహశీల్దారులు, BLO, పంచాయతి కార్యదర్శులు, సూపర్వైజర్లతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

News October 25, 2025

కోస్గి ఎంపీడీఓగా తాండూరు యువకుడికి పోస్టింగ్

image

గ్రూప్-1లో ఉద్యోగం సాధించిన తాండూరు యువకుడు కుర్వ క్రాంతికి నారాయణపేట జిల్లా కోస్గి మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ)గా పోస్టింగ్ ఖరారైంది. శిక్షణ పూర్తి చేసుకున్న ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, డైరెక్టర్ సృజన ద్వారా నియామక పత్రాన్ని అందించారు. క్రాంతి సోమవారం కోస్గి ఎంపీడీఓగా మొదటిసారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తాండూరు ప్రజలు క్రాంతికి అభినందనలు తెలిపారు.