News August 13, 2024
RR: లంచం తీసుకుంటూ దొరికిన అడిషనల్ కలెక్టర్
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పని చేస్తున్న అవినీతి అధికారులు పట్టుబడ్డారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డారు. ధరణిలో మార్పులు చేసేందుకు రైతు నుంచి రూ. 8 లక్షలు డిమాండ్ చేసి దొరికిపోయారు. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ. 16 లక్షల నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 12, 2024
HYD: ఫోన్ల రికవరీలో తెలంగాణ TOP-2
HYD నగరలో క్రైమ్ రివ్యూ మీటింగ్ డీజీపీ డాక్టర్ జితేందర్ అధ్యక్షతన జరిగింది. 557 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోగొట్టుకున్న 50,788 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. ఫోన్లు రికవరీ చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ రెండో ర్యాంక్ సాధించిందని తెలిపారు. తెలంగాణలో సరాసరిగా రోజుకు 91 మొబైల్ ఫోన్లు రికవరీ అవుతున్నట్లు తెలిపారు.
News November 12, 2024
HYD: 15 వేల మంది విద్యార్థులతో ప్రోగ్రాం: సీఎం
HYDలో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే రోజు దాదాపుగా 15,000 మంది విద్యార్థులతో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు, పూర్తి వివరాలు వివరించనున్నట్లు సెక్రటేరియట్లో పేర్కొన్నారు. 20-25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థుల కెపాసిటీతో గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
News November 12, 2024
HYD: ఎలక్ట్రిక్ బస్సులు పెంచడంపై ఆర్టీసీ ఫోకస్
గ్రేటర్ HYD జోన్ పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతుండగా వాటిలో 40 పుష్పక్ బస్సులతో కలిపి దాదాపు 115 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి కొన్ని అందుబాటులోకి తేనుంది. కోకాపేట, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్ డిపోల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.