News July 31, 2024

RR: వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేస్తున్నారు. రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు.

Similar News

News September 25, 2024

హైదరాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి రూ. 180 మధ్య విక్రయించారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. మంగళవారం, బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ KG రూ. 213, స్కిన్‌లెస్ KG రూ. 243‌గా నిర్ణయించారు. ఫాంరేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్ముతున్నారు.

News September 25, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్‌సాగర్

image

నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. ట్యాంక్‌బండ్ పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 513.41 మీటర్లకు చేరింది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్​ఫ్లో ఎక్కువైతే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలనున్నారు. హైదరాబాద్‌కు వర్ష సూచన ఉండడంతో‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచించారు.

News September 24, 2024

విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: RSP

image

రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను BRS నేత RSP ‘X’ ద్వారా ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ప్రభుత్వo DSC పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు5 వరకు ఆన్‌లైన్(CBT)లో నిర్వహించింది. అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా హడావుడిగా ఎగ్జామ్ నిర్వహించింది. ఇంకా రిజల్ట్స్ విడుదలచేయలేదు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు. ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు. విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.