News March 1, 2025

RR: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, పరీక్షలు జరిగే ప్రదేశాలలో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలన్నారు. 185 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, ఇంటర్ మొదటి, రెండవ వార్షిక పరీక్షలకు 1,47,211 మంది, పది వార్షిక పరీక్షలకు 51,794 విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

Similar News

News March 3, 2025

రంగారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు ఇలా.!

image

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నేడు మోయినాబాద్లో 39.2℃, తలకొండపల్లి 39.0, ఫరూక్‌నగర్ 39.0, ఇబ్రహీంపట్నం 38.8, షాబాద్ 38.7, మహేశ్వరం 38.4, హయత్‌నగర్ 38.0, శంకర్‌పల్లి 38, శేరిలింగంపల్లి 37.9, కందుకూర్ 37.9, కొత్తూర్, సారూర్‌నగర్, కేశంపేట 37.2, రాజేంద్రనగర్ 36.9, కడ్తాల్ 36.7, చేవెళ్ల 36.7, శంషాబాద్ 36.6, నందిగామ 36.4, కొందుర్గ్ 36.4, తాల్లపల్లి 36.3, యాచారంలో 36.1℃గా నమోదైంది. 

News March 2, 2025

HYD: యువకుడితో పరారైన 35 ఏళ్ల వివాహిత

image

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన మేడ్చల్ పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడుకు చెందిన గోపి(22)కి వరంగల్‌‌కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్‌పై వెళ్తుండగా.. భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News March 2, 2025

SUNDAY: HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

image

భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. తలకాయ కాళ్లు, బోటీకి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది.

error: Content is protected !!