News August 20, 2024

RR: 5,924 రోజులుగా నిరీక్షణ!

image

IPL ట్రోఫీని గెలిచేందుకు అన్ని టీమ్స్ శాయశక్తులా కష్టపడతాయి. కానీ, చివరికి ఒక్క జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అయితే ఓసారి కప్ గెలిచిన టీమ్ మరోసారి దాన్ని నెగ్గడం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. 2008లో తొలిసారి IPL ట్రోఫీ నెగ్గిన RR మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు 5,924 రోజులుగా ఎదురుచూస్తోంది. అటు SRH 2016లో గెలవగా 3005 రోజులుగా మరో ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. MI కూడా కప్ గెలిచి 1379 రోజులైంది.

Similar News

News November 19, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

image

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 19, 2025

PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

image

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.

News November 19, 2025

నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

image

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్‌గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.