News September 30, 2024
RR: 60 చెరువుల్లో భారీ ఆక్రమణలు..!
HMDA పరిధిలోని HYD, RR, MDCL, భువనగిరి, సంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట మొత్తం 7 జిల్లాల్లో 3,532 చెరువులు ఉన్నాయి. పలు చెరువుల సర్వే పూర్తయింది. గ్రేటర్ HYDలో అనేక చెరువుల రూపురేఖలు కోల్పోయాయని భారత రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తెలిపింది. గ్రేటర్‌లో 60 చెరువుల్లో భారీ ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. కొన్నిచోట్ల తప్పుడు సర్వే నంబర్లు ఉపయోగించి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం ఉండడంతో నిఘా పెట్టారు.
Similar News
News October 11, 2024
తెలంగాణ ఉద్యమకారుల కమిటీ రద్దు: పిడమర్తి రవి
తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.
News October 11, 2024
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. 28 ప్రాంతాల్లో ఒకేసారి భవన నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మధిరలో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని సీఎస్ ప్రకటించారు.
News October 10, 2024
BREAKING.. HYD: విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.