News March 20, 2025

ఆర్ఆర్‌బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా

image

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1, 2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏ సెంటర్లనోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది సీబీటీ-1 నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.

Similar News

News January 25, 2026

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం

News January 25, 2026

చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ అదేనా?

image

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జులై 10న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

News January 25, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.