News July 4, 2024
RRR.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాల సేకరణ

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు, అందోల్-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.
Similar News
News January 7, 2026
మెదక్: 108 సిబ్బందికి అత్యవసర వైద్య శిక్షణ

మెదక్ జిల్లా కేంద్రంలో 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు ‘రిఫ్రెష్ ట్రైనింగ్’ నిర్వహించారు. అత్యవసర సమయంలో గర్భిణులకు అంబులెన్స్‌లోనే సురక్షితంగా కాన్పు చేయడం, నవజాత శిశువుల సంరక్షణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణనష్టం నివారించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ సంపత్, ఇన్‌స్ట్రక్టర్ అరవింద పాల్గొన్నారు.
News January 7, 2026
మెదక్: ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన డీఎస్పీ

విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పథకానికి ఎంపికైన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌ను TUWJU నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ రియాజుద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఇంతియాజుద్దీన్, సబ్దర్ అలీ, యూసుఫ్ అలీలు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సేవలను నాయకులు కొనియాడారు.
News January 6, 2026
మెదక్: పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పన: కలెక్టర్

పొరపాటు లేకుండా తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో పురపాలక తుది ఓటరు జాబితా రూపకల్పనపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.


