News April 5, 2024
RRR చేరికపై ఉత్కంఠకు తెర.. పోటీ ఎక్కడి నుంచి..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠకు నేటితో తెరపడింది. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. రఘురామ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? ఒకవేళ బరిలో ఉంటే లోక్సభకా..? అసెంబ్లీకా ..? అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. ‘కూటమి నుంచి పక్కా బరిలో ఉంటా. రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది’ అని అన్న రఘురామకు ఏ టికెట్ ఇస్తారో వేచి చూడాలి.
Similar News
News December 8, 2025
టెట్ అభ్యర్థులకు 10 నుంచి పరీక్షలు

టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
News December 8, 2025
బొమ్మూరు: స్టార్టప్ ఐడియా ఉందా? రండి.. ‘స్పార్క్’ చూపిద్దాం!

నూతన ఆవిష్కరణలు, వినూత్న వ్యాపార ఆలోచనలు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 9 నుంచి 11 వరకు ‘స్పార్క్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ వై. మేఘ స్వరూప్తో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణలో నిపుణులు దిశానిర్దేశం చేస్తారన్నారు. నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.
News December 8, 2025
ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించండి: తూ.గో. ఎస్పీ

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 32 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బాధితుల నుంచి స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి.. బాధితుల ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. PGRS అర్జీల పరిష్కారంలో జాప్యం వహించరాదని ఆయన స్పష్టం చేశారు.


