News September 10, 2024

RRR భూ సేకరణకు మరో ముందడుగు..!

image

RRR భూ సేకరణకు మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు జాతీయ రహదారుల విభాగం వారు కోరినంత స్థలాన్ని అప్పగించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాకు సంబంధించి తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు అదనపు కలెక్టర్, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్లకు ఆయా డివిజన్ల ఆర్డీవోలను అధీకృత భూసేకరణ అధికారులుగా నియమించారు.

Similar News

News December 11, 2025

BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్‌‌గా వాణి సందీప్ రెడ్డి

image

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్‌ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.

News December 11, 2025

నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

image

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్‌ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.

News December 11, 2025

MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

image

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.