News July 4, 2024

RRR.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాల సేకరణ

image

ఉమ్మడి జిల్లాలో RRR నిర్మాణానికి 80 శాతం సర్వే పూర్తి కావడంతో అధికారులు భూ సేకరణకు కసరత్తు చేస్తున్నారు. RRR ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 110KM ఉండటంతో 4,500 ఎకరాల భూమిని సేకరిస్తారు. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు, అందోల్‌-జోగిపేట, గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి పరిధిలో మొత్తంగా 54 గ్రామాల్లో భూమి తీసుకుంటారు. అటు ప్రభుత్వ నిర్ణయంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భూ నిర్వాసితులు అంటున్నారు.

Similar News

News October 2, 2024

MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.

News October 1, 2024

MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

News October 1, 2024

MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు

image

సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.