News February 24, 2026

RRR కేసులో నన్ను ఇరికించారు: సునీల్

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న <<19220184>>IPS సునీల్ నాయక్<<>> Xలో సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈ కేసులో నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు. EX CM జగన్, IPS PV సునీల్‌కు వ్యతిరేకంగా చెప్పకపోతే నేరస్థుడివి అవుతావని ఫిర్యాదుదారుడు నన్ను బెదిరించాడు. RRR కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని ప్రభావితం చేశారో తెలుస్తుంది. త్వరలో ఆధారాలు బయటపెడతా’ అని పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

మావోయిజం ఎప్పటికీ అంతం కాదు: రాజిరెడ్డి

image

లొంగిపోతూ మల్లా రాజిరెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మావోయిజం ఎప్పటికీ అంతం కాదని DGP సమక్షంలోనే ప్రకటించారు. రాజ్యంగబద్ధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు మిగతా జీవితాన్ని వెచ్చిస్తానని తెలిపారు. తనకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్‌ను DGP నుంచి అందుకున్న తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూనే మావోయిస్టుల ట్రేడ్ మార్క్‌ను గుర్తుచేస్తూ పిడికిలి బిగించటంతో పోలీసు అధికారులందరూ ఒకేసారి నవ్వారు.

News February 24, 2026

అమ్మాయిలకు ఉచితంగా HPV వ్యాక్సిన్!

image

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు HPV వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే Gardasil ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027 నాటికి 2.6 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాయి. <<19154747>>సర్వైకల్<<>> (గర్భాశయ) క్యాన్సర్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి.

News February 24, 2026

కీరదోసలో పండు ఈగ – నివారణ

image

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన సన్నని పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తిని నష్టపరుస్తాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోయి దిగుబడి తగ్గిపోతుంది. వీటి నివారణకు లీటరు నీటికి మలాథియాన్‌ 2ml (లేదా) ప్రొఫెనోఫాస్‌ 2ml కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగులను నివారించడానికి విషపు ఎరలను తయారు చేసుకోవాలి.