News May 21, 2024
RRR విజయం సాధించేనా..?

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ 13 చోట్ల గెలిచింది. 2 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. అయితే వైసీపీ MPగా గెలిచి.. ఆ పార్టీకి రాజీనామా చేసిన RRR టీడీపీలో చేరి ఉండి MLA అభ్యర్థిగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో అందరి దృష్టి అటువైపు మళ్లింది. మరి RRR విజయం సాధించేనా..?
– ఉమ్మడి ప.గో.లో కూటమికి ఎన్ని సీట్లు రావొచ్చు..?
Similar News
News December 25, 2025
గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 25, 2025
ఎస్.హెచ్.జీ మహిళల ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి: కలెక్టర్

స్వయం సహాయక సంఘాల మహిళలు నెలకొల్పిన ప్రాజెక్టుల అభివృద్ధిలో యువ విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఆమె అధికారులతో సమీక్షించారు. మహిళలు నడుపుతున్న చాక్లెట్ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు వినూత్న మార్కెటింగ్, బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్ బాక్సుల తయారీపై కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొందించాలని, తద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు.