News January 24, 2025
RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నట్స్.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.
News November 28, 2025
2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iocl.com
News November 28, 2025
వరల్డ్లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. నేడు ప్రారంభించనున్న మోదీ

ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ నేడు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు. మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.


