News June 18, 2024
డ్రైనేజీల కోసం RRR రూ.5 లక్షల విరాళం.. సహకారం అందించాలని పిలుపు

AP: ప్రజల భాగస్వామ్యంతో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని TDP ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. అక్కడ మురుగుకాలువల బాగు కోసం కలెక్టర్ సహకారంతో “Drainage Maintenance Infrastructure Fund, UNDI” పేరుతో ప్రత్యేక ఖాతాను తెరిపించానని చెప్పారు. ఈ నిధికి తొలి విరాళంగా రూ.5 లక్షలు ఇచ్చానని, ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని RRR కోరారు.
Similar News
News November 9, 2025
NFUకు భారత్ కట్టుబడి ఉంది : రాజ్నాథ్ సింగ్

భారత్ ఏ దేశంపైనా ముందుగా అణు దాడి చేయకూడదనే NFU (No First Use) సూత్రానికి కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దాడి చేస్తే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. పొరుగు దేశాల కవ్వింపు చర్యలకు భయపడబోమన్నారు. అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. సంయమనం, సంసిద్ధత రెండింటిపై భారత్ ఆధారపడి ఉంటుందన్నారు.
News November 9, 2025
సమాజం కోసం ఏర్పడిందే RSS: మోహన్ భాగవత్

RSS సమాజం కోసం ఏర్పడిందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ‘ఆర్ఎస్ఎస్ దేనికీ వ్యతిరేకం కాదు. అది అధికారాన్ని కోరుకోదు. సమాజంలో ప్రాధాన్యతను ఆశించదు. దేశ కీర్తి పెంచేందుకు సేవ చేయాలని కోరుకుంటుంది. మొదట్లో RSSను ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు’ అని అన్నారు. RSS 100ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
News November 9, 2025
డిసెంబర్ 15న IPL వేలం!

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.


