News March 25, 2025
‘RRR’ సినిమాకు మూడేళ్లు!

హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. సరిగ్గా ఇదేరోజున 2022లో ఈ చిత్రం రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ‘మూడేళ్ల క్రితం విడుదలైన RRR సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. నాటు నాటు పాటకు హీరోలు వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల కేరింతలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.
Similar News
News October 20, 2025
దేశ ప్రజలకు రాష్ట్రపతి, పీఎం దీపావళి విషెస్

దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సామరస్యం నింపాలని ఆకాంక్షించారు. నిన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
News October 20, 2025
దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టమట

దీపావళి పర్వదినాన కొన్ని ప్రత్యేక సంకేతాలు అదృష్టాన్ని, లక్ష్మీ అనుగ్రహాన్ని సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. మహాలక్ష్మి వాహనమైన గుడ్లగూబను చూస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వృద్ధి చెందుతుందని అంటున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర పువ్వును చూస్తే ధనవృద్ధి ఉంటుందంటున్నారు. కాకి కనిపించడం పూర్వీకుల ఆశీస్సులతో సమానమట. వీటితో పాటు ఆవులు, బల్లులను చూడటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు.
News October 20, 2025
కొత్తగా 41 కాలేజీలు.. 10,650 ఎంబీబీఎస్ సీట్లు

2025-26 విద్యాసంవత్సరానికిగానూ 10,650 MBBS సీట్లకు NMC ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 1,37,600కు చేరనుంది. వీటిలో INIకు చెందిన సీట్లూ ఉన్నాయని వెల్లడించింది. దీంతో పాటు 41 నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలపగా మొత్తం విద్యాసంస్థల సంఖ్య 816కు పెరగనుంది. అటు పీజీ సీట్లు 5వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని దీంతో దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 67వేలకు చేరే అవకాశం ఉంది.