News November 1, 2024
RS ప్రవీణ్ కుమార్ సెటైరికల్ ట్వీట్!

జన్వాడ ఫాంహౌస్ కేసు నేపథ్యంలో BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దీపావళికి దావత్ ప్లాన్ ఉంటే బ్రీత్ అనలైజర్లు, డ్రగ్ టూల్ కిట్లు దగ్గర ఉంచుకోండి. తాగాలనుకుంటే మందు బాటిళ్ల బిల్లులు ఉంచుకోండి. మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు కనుక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. గిట్టనివాళ్లు రేవ్ పార్టీ అనే ప్రమాదముంది. అప్రమత్తంగా ఉండండి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News May 7, 2025
MBNR: నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News May 7, 2025
జడ్చర్ల: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.
News May 7, 2025
MBNR: ‘మే 3 నుంచి వేసవి శిబిరం ప్రారంభం’

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సుద్దాల హనుమంతు సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మే 3 నుంచి ప్రారంభించనున్నామని నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులు పదేళ్లు దాటిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.