News March 24, 2025
అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.
Similar News
News October 15, 2025
అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
News October 15, 2025
పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్’ స్టాక్మార్కెట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
News October 15, 2025
రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.