News May 24, 2024

మనుషుల మలానికి రూ.1.40 కోట్లు.. ఓ కంపెనీ ఆఫర్!

image

USAలోని humanmicrobes కంపెనీ మనిషి మలానికి ఏడాదికి ₹1.40 Cr ఇస్తోంది. దాతగా మారాలంటే సంపూర్ణ ఆరోగ్యమే అర్హత. క్యాన్సర్, పార్కిన్సన్స్, ఆటిజం వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని వైద్యులు ఇటీవల ఫికల్ మైక్రోబైమ్స్ ట్రాన్స్‌ప్లాంట్ విధానంలో నయం చేస్తున్నారు. ఇందుకు కావాల్సిన మైక్రోబైమ్స్ మన చిన్నపేగుల్లోనే సులువుగా, ట్రిలియన్లలో ఉంటాయి. కానీ 0.1% కంటే తక్కువ మంది ఆరోగ్యకర మలం విసర్జిస్తారట. అందుకే ఈ డిమాండ్.

Similar News

News November 8, 2025

న్యాయవాదుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాం: ఫరూక్

image

AP: వైసీపీ తన పాలనలో న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి ఫరూక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని వివరించారు. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ.46కోట్లు రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. న్యాయవాది కుటుంబానికి సంక్షేమ నిధి ఇచ్చే మొత్తానికి అదనంగా రూ.4లక్షలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News November 8, 2025

చంద్రుడిపై నీరు, మంచు జాడను కనుగొనడంలో కీలక ముందడుగు!

image

2019లో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-2 తన మిషన్‌ను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇస్రో SAC సైంటిస్టులు దాని DFSA రాడార్ నుంచి ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నారు. సుమారు 1,400 రాడార్ డేటాసెట్స్‌ను కలెక్ట్ చేసి ప్రాసెస్ చేశారు. తొలిసారి చంద్రుడి పూర్తి పొలారిమెట్రిక్, L-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను రూపొందించారు. ఇది చంద్రుడి ఉపరితలంపై నీరు, మంచు జాడలను కనుగొనేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.

News November 8, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➤ WWC విజయం: రిచా ఘోష్‌ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్‌: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.