News October 20, 2025

ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.

Similar News

News October 20, 2025

దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

image

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.

News October 20, 2025

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

image

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్‌లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.

News October 20, 2025

మీకు తెలుసా? దేవతల పుత్రుడే ‘నరకాసురుడు’

image

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడ్ని చంపి, వెలుగు నింపినందుకు గుర్తుగా మనం దీపావళి జరుపుకుంటాం. అయితే ఆ నరకాసురుడు దేవతల పుత్రుడే అని మీకు తెలుసా? విష్ణుమూర్తి వరాహ అవతారానికి, భూదేవికి జన్మించిన కుమారుడే ఈ అసురుడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించిన ఇతను దుష్ట స్వభావాన్ని పెంచుకుని అసురుడిగా మారాడు. అహంకారం పెరిగి 16K రాజకుమార్తెలను బంధించాడు. తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేని వరం ఉండేది.